నంద్యాల జిల్లా మహానంది మండలంలో విషాద ఘటన నెలకొంది. మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో లారీలో అరటి గెలల లోడు వేసుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరి వ్యక్తులు ఆదివారం మృతి చెందారు. అబ్బిపురంకి చెందిన షేక్ నాగూర్ బాషా, నూనెపల్లెకు చెందిన రాఘవేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.