ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు కింద ఆయకట్టు భూములకు, తాగునీరు అందించేందుకు, కుడి, ఎడమ కాల్వలకు స్థానిక ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు సాగునీరు ఇవ్వక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, రైతులు నష్టపోకుండా కూటమి ప్రభుత్వం రబీ సాగుకు 3, 700 ఎకరాలకు సాగునీరు అందిస్తోందన్నారు.