ఎమ్మిగనూరు మండలం గుడేకల్ గ్రామంలో శ్రావణమాసం మూడవ శనివారం వర్షాల కోసం గంగా జలంతో దేవతామూర్తులకు జలాబిషేకం చేశారు. గ్రామస్తులు ఏటికి వెళ్లి గురుజాల వద్ద గంగా జలం తీసుకొని గ్రామానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు మేళతాళాలతో ఉరేగింపుగా గంగా జలం తెచ్చిన వారికి స్వాగతం పలికారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు బాగాపండాలని ప్రతి సంవత్సరం ఇలా చేయడం అనవాయితీగా వస్తుంది.