కర్నూలు జిల్లాలోని పశ్చిమ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం తుంగభద్ర నదికి వరద నీటి ప్రవాహం పెరిగింది. సుంకేసుల బ్యారేజీకి 59, 801 క్యూసెక్కుల ఇనో ఫ్లో ఉండగా, సాయంత్రం 95, 097 క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న నీటిలో 21 గేట్ల ద్వారా దిగువకు 92, 652, కేసీ కాలువకు 2, 445 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.