AP: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మిథున్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అయన అరెస్ట్ ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.