AP: సమరయోధుల బాటలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సుపరిపాలనను అందిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. కాకినాడలో మాట్లాడుతూ..‘సూపర్-6 అమలుకు షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాం. సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచాం. ఉచితంగా ఇసుక అందిస్తున్నాం. డొక్కా సీతమ్మ పేరిట స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, NTR స్ఫూర్తితో పేదలకు రూ.5కే భోజనం కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.