AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన నేత నాగబాబు శుక్రవారం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. పవన్ ఆదేశాలకు అనుగుణంగా అవసరమైన పత్రాలను పార్టీ కార్యాలయంలో సిద్ధం చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కాగా, ఈ నెల 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.