కర్నూలు జిల్లాలోని వేరుశనగ కాయల ధర క్రమంగా తగ్గిపోతోంది. ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ క్వింటం గరిష్ఠంగా రూ. 6258 పలికింది. కనిష్ఠ ధర రూ. 3, 600, మధ్యస్థ ధర రూ. 5780 పలికింది. మద్దతు ధర రూ. 6, 500గా ప్రభుత్వం నిర్ణయించింది. గత వారం ధరతో పోల్చితే వేరుశనగ ధర క్వింటానికి రూ. 350 పైగా పెరిగింది. 488 బస్తాల వేరుశనగ విక్రయానికి వచ్చింది. ప్రభుత్వం క్వింటంపై రూ. 6, 500 మద్దతు ధర ప్రకటించింది.