హోలుగుంద: నాటు సారా స్థావరాలపై దాడులు
హోలుగుంద మండలం కొత్తపేట తండా గ్రామ కొండల్లో మంగళవారం ఉదయం నాటు సారా బట్టిలపై దాడులు నిర్వహించిన పోలీసులు. ఈ దాడుల్లో 800 లీటర్ల బెల్లపు ఉట, సారాను ధ్వంసం చేశామని తెలిపారు. అలాగే నాటు సారా తయారికి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ బాల నరసింహులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.