బనగానపల్లె మండలంలోని నందవరం శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి దేవస్థానంలో ఈనెల 16న శ్రావణమాస రెండవ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తున్నట్లు ఈవో కామేశ్వరమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వరలక్ష్మి సందర్భంగా ఉదయం 10 గంటల నుండి అమ్మవారికి విశేష అభిషేకం, అనంతరం ముత్తైదువులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.