అవుకు: ఎస్టీ రిజర్వేషన్ కోసం అందరూ ఐక్యంగా ఉద్యమించాలి
సమాజంలో వెనుకబాటుతనానికి గురవుతున్న వాల్మీకులను పాలక ప్రభుత్వాలు ఎస్టీలుగా గుర్తించేవరకు ఐక్యంగా ఉద్య మించాలని మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండ అన్నారు. ఆదివారం అవుకు మండలంలోని సుంకేసుల గ్రామంలో వాల్మీకి సోదరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు దూరంగా ఉండి మీ పిల్లలను విద్యావంతులను చేసుకోవాలన్నారు.