రాజకీయ జీవితంలో మచ్చలేని మహా నాయకుడు దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని తెదేపా నాయకులు రాజా నారాయణమూర్తి, ఖాజా పీర్ పేర్కొన్నారు. ప్యాపిలి పట్టణంలోని కోట్ల విగ్రహాం వద్ద ఆయన జయంతిని శుక్రవారం ఘనంగా తెదేపా నాయకులు నిర్వహించారు. కోట్ల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ధనం మధు, కోదండరా మయ్య, చల్లావీర, బ్యాంక్ శ్రీను, మధు, ఎస్కే వలి, పాల్గొన్నారు.