ప్రతి ఒక్కరం పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించి మట్టి వినాయకులనే పూజిద్దామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. గురువారం పాత బస్టాండ్ లోని వాసవి ఏజెన్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ శేషు ఫణిశెట్టి ఆధ్వర్యంలో 2000 మట్టి వినాయకులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర ఆర్యవైశ్య నాయకులు ఇల్లూరు లక్ష్మయ్య, దేవకి వెంకటేశ్వర్లు ల తో కలసి పంపిణీ చేశారు.