చిరుత పులి దాడిలో 10 గొర్రెలు మృతి

70చూసినవారు
చిరుత పులి దాడిలో 10 గొర్రెలు మృతి
పెద్దకడబూరు మండలంలో గవిగట్టు సమీపంలోని గట్టులో ఉన్న చిరుత పులి గొర్రెలకాపరులు పెద్ద ఈరన్న, అయ్యప్ప, మునిస్వామి, ఉలిగయ్య, గాదిరెడ్డిల గొర్రెల మందపై దాడి చేసి 10 గొర్రెలను పొట్టన పెట్టుకున్నట్లు బాధిత గొర్రెలకాపరులు బుధవారం విలేకరులకు తెలిపారు. చిరుత పులి సంచారంతో తమకు కంటి మీద కునుకులేదనన్నారు. తక్షణమే అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించి తీసుకెళ్లాలని, తగిన ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్