పెద్దకడబూరులో డ్రైనేజీని తలపిస్తున్న ప్రధాన రహదారులు!

55చూసినవారు
పెద్దకడబూరులో ప్రధాన రహదారులు డ్రైనేజీని తలపిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. గ్రామంలోని ప్రధాన రహదారి, అంబేడ్కర్ విగ్రహం ఎదుట, కురువ కాలనీలో మురుగునీటితో దుర్గంధం వెదజల్లుతోంది. అధికారులకు, సర్పంచ్ కు ఎన్నిసార్లు ప్రజలు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్