పెద్దకడబూరు పోలీసు స్టేషన్ లో కొత్త ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన నిరంజన్ రెడ్డిని నాగలాపురం గ్రామ టీడీపీ నాయకులు హనుమయ్య, పెద్ద ఈరన్న, వందగల్లు నరశింహా, రాఘవేంద్ర, నబిసాబ్, విశ్వనాథ, లక్షీరెడ్డి, నరసప్ప, గోపాల్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ఐ నిరంజన్ రెడ్డికి శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలోని శాంతిభద్రతలపై చర్చించారు.