నందికొట్కూరు: సచివాలయాల ముందు కమ్యూనిస్టు పార్టీ ధర్నా
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలకు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు ఇంటి స్థల నిర్మాణం కోసం ఐదు లక్షల చొప్పున నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా కేంద్రంలోని సంతపేట దగ్గర ఉన్న సచివాలయం ముందు ఇల్లు లేని నిరుపేదలతో కలిసి ధర్నా నిర్వహించారు.