ఉడుములపాడు లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సచివాలయం, ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ ఉప్పరి రాధమ్మ జెండా ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన వారిని ఎప్పటికీ మరువరాదని తెలిపారు. గ్రామ పెద్ద ఉప్పరి రామాంజనేయులు మాట్లాడుతూ చిన్నారుల స్వాతంత్ర సమరయోధుల వేషధారణ అబ్బురపరిచిందన్నారు. వేడుకల్లో గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామస్తులు స్వాతంత్ర సమర యోధులను స్మరించుకున్నారు.