పాణ్యం: అరుదైన శస్త్ర చికిత్స.. కాలేయంలో కణితి తొలగింపు
పాణ్యం మండలం గగ్గటూరు గ్రామానికి చెందిన 35 ఏళ్ల రోగికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జనరల్ సర్జరీ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. శుక్రవారం రోగి డిశ్చార్జి అవుతున్న సందర్భంగా వైద్యులు మాట్లాడారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన రవి గత ఏడాది నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నారు. కాలేయంలో గడ్డ ఉందని తెలియడంతో పెద్దాసుపత్రిలో కాలేయంలో 18 సెంటిమీటర్ల మ్యూసినస్ సిఫ్ట్ ఆపరేషన్ ను తొలగించారు.