పత్తికొండ డివిజన్ పరిధిలో రేషన్ డీలర్ల దుకాణాలకు సంబందించి 262 దరఖాస్తులు అందాయని ఆర్డీవో భరత్ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9 మండలాల్లో 45 దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. దరఖాస్తులను 31న పరిశీలిస్తామని, అర్హుల జాబితా అదేరోజు ప్రచురిస్తామని, జనవరి 5న రాతతపరీక్ష ఉంటుందని 3వతేదీన హాల్ టికెట్లు ఇస్తామని ఆర్డీవో భరత్ నాయక్ అన్నారు.