పత్తికొండ: రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలి: ఎమ్మెల్యే

80చూసినవారు
పత్తికొండ: రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలి: ఎమ్మెల్యే
పత్తికొండ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సూచించారు. శనివారం పత్తికొండ పార్టీ కార్యాలయంలో డా. కల్పన పర్యవేక్షణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 150 మందికి పైగా నాయకులు, యువకులు రక్తదానం చేశారు. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర కూడా రక్తదానం చేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, బత్తిన వెంకట్రాముడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్