పెదకూరపాడు స్టేషన్‌ను పరిశీలించిన అసిస్టెంట్ కమిషనర్
పెదకూరపాడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను స్టేట్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ ఎం సుధాకర్ రెడ్డి, జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంటు అసిస్టెంట్ కమిషనర్ ఎం రవి కుమార్ రెడ్డి, జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరిండెంట్ జి సూర్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. పరిశీలన అనంతరం వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయన్నారు. వారి వెంట సిఐ వి శ్రీనివాసులు, ఎస్ఐ డిపి హుస్సేన్ పాల్గొన్నారు.