నంద్యాల జిల్లా మహానంది దేవస్థానం మహానందిలో కనుమ పండుగ సందర్భంగా దేవస్థానం గోశాలలో బుధవారం పశువులకు ప్రత్యేక పూజలు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకకళ్యాణార్థమై గోవులకు ఆవాహనాది ఉపచారములు, శృంగ పూజ, అథాంగ పూజలను వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.