ఆత్మకూరులో ఇస్తేమా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
ఆత్మకూరు పట్టణంలో ఎంతో ఆర్భాటంగా జరిగే ఇస్తేమా కార్యక్రమానికి కట్టదిట్టమైన భద్రత కల్పించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పోలీసు అధికారిపై ఉందని నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా అన్నారు. శుక్రవారం పట్టణ చివర్లో ఏర్పాటు చేసిన ఇస్తేమా ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. ఇస్తేమా ఏర్పాట్లపై నిర్వాహకులను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.