వెలుగోడు తెలుగు గంగ జలాశయంలో సోమవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేప పిల్లలను విడుదల చేశారు. ముందుగా రిజర్వాయర్ జలాలకు పూజలు చేపట్టి గంగమ్మ తల్లికి వాయనం సమర్పించారు. అనంతరం రిజర్వాయర్లు చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు రాఘవరెడ్డి, భరత్ మండల అధికారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.