వివాహితను అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తతోపాటు మరో ఐదుగురిపై గోనెగండ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం గాజులదిన్నెకు చెందిన సుజాతను పత్తికొండకు చెందిన మల్లికార్జునకు ఇచ్చి మూడేళ్ల క్రితం పెళ్లి చేశారు. కొద్ది రోజుల నుంచి భర్త మల్లికార్జునతోపాటు అత్త ఎల్లమ్మ, మామ మల్లికార్జున, వారి కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని సుజాత ఫిర్యాదు చేశారు.