ఎమ్మిగనూరు పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల ఆకలికేకలకు కారణమై విధుల నుంచి తొలగించబడిన ప్రిన్సిపాల్ కవితకు రీ పోస్టింగ్ ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు శేఖర్ నాయుడు, మహేంద్రబాబు కోరారు. ప్రిన్సిపాల్ కవితపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్న డీఈవోపై చర్యలు తీసుకోవాలని సోమవారం విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు పోస్టుకార్డు ద్వారా ఫిర్యాదు చేశారు.