టీడీపీతోనే కురువల అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కురవ కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ రామకృష్ణ, కురువ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దిలేటి అన్నారు. సోమవారం నందవరంలో కురువ సంఘం నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడారు. కురువలకు టీడీపీ పార్టీలో సముచిత స్థానం కల్పించిందన్నారు. త్వరలో కురువలకు గొర్రెలు, మేకల పెంపకం రుణాలు కూడా ప్రభుత్వం అందజేస్తుందన్నారు.