అగ్ని ప్రమాదం వల్ల రెండు గడ్డి వాముల దగ్ధం
అనంతసాగరం మండలం దేవరాయపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి, కృష్ణారెడ్డిల రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ఘటన శనివారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫైర్ సిబ్బంది రంగ ప్రవేశంతో మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. ఈఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఏర్పడ్డాయా..? లేక కావాలనే ఎవరైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.