మర్రిపాడులో టిడిపి నేతల సమావేశ కార్యక్రమం

1073చూసినవారు
మర్రిపాడులో టిడిపి నేతల సమావేశ కార్యక్రమం
మర్రిపాడు పట్టణంలోని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నివాసం నందు ఆదివారం ఉదయం టిడిపి నేతలు సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆత్మకూరు టిడిపి అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి విచ్చేశారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, పలువురు టిడిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్