కందుకూరు: ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న గేటు మరమ్మత్తు పనులు

63చూసినవారు
గత మూడు రోజుల నుంచి రాళ్లపాడు ప్రాజెక్టు కుడి గేటు మరమ్మత్తు పనులు కొనసాగుతూ ఉన్నాయి. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు గురువారం మరోసారి అక్కడికి చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గేటు మరమ్మత్తుల పని పూర్తి చేసి రైతులకు సకాలంలో నీరు అందించాలని నిపుణులను ఎమ్మెల్యే కోరారు. ప్రాజెక్టు వద్దకు మంగళవారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సైతం చేరుకొని రాత్రి వరకు అక్కడే ఉన్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్