టిడిపి కార్యకర్తలు నలిగిపోతున్నారు. కలలో ఊహించని పరిణామాలు చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం లాగే ఇంకా దారుణాలు జరుగుతున్నాయని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు అన్నారు. బడుగు బలహీన వర్గానికి చెందిన గొర్రెపాటి కార్తీక్ పై కేసు పెట్టి నానా రకాలుగా హింసించడం సరికాదంటూ దగదర్తి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. కార్తీక్ ను కొట్టిన ఎస్ఐ ప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.