ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు

62చూసినవారు
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న తేదీ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా కావలి పట్టణంలోని బృందావనం కాలనీ కల్యాణ మండపం, అల్లూరులోని టిటిడి కల్యాణ మండపంలో ఎల్ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.