మంత్రి నారాలోకేష్ ని ఉండవల్లిలోని వారి నివాసంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు,టిడిపి కావలి మాజీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర లు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కావలి నియోజకవర్గ పార్టీ స్థితిగతుల గురించి మాలేపాటి సుబ్బానాయుడు లోకేష్ కి సవివరంగా వివరించారు.సానుకూలంగా స్పందించిన లోకేష్ నేను మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు.