విడవలూరు మండలంలోని రామతీర్థం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. గత నెల 26 నుండి జులై ఆరవ తేదీ శనివారం రాత్రి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి. పది రోజులుగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.