బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్లూరు మండలంలోని నార్త్ మోపూరు, బీరంగుంట, రైస్ మిల్ కాలనీ, తుఫాన్ నగర్, మందిరం, తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి మోస్తరుగా వర్షం కురుస్తోంది. అదేవిధంగా నాయుడుపేట, దొరవారిసత్రం తదితర మండలాల్లో వర్షం కురవడంతో స్థానికులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.