తెలుగు గంగ ప్రాజెక్టు రూపొందించి నెల్లూరు నేలను కృష్ణా జలాలతో తడిపిన ఘనత నందమూరి తారక రామారావు దేనిని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీలోనే ఏ జిల్లాకు లేనివిధంగా నెల్లూరుకు 146 టీఎంసీల సామర్థ్యం కలిగిన, సోమశిల కండలేరు జలాశయాలు ఉండటం ఎన్టీఆర్ పుణ్యమే అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి శనివారం ఎన్టీఆర్ తో అప్పట్లో దిగిన ఫోటోను ట్విట్ చేశారు.