యువకుడు అదృశ్యంపై కేసు నమోదు
యువకుడు అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఓజిలి మండలం రుద్రయ్యపాలెంకు చెందిన అనిల్ అనే యువకుడు నాయుడుపేట మండలం మేనకూరు సెజ్ లోని అరబిందో పరిశ్రమలో పనిచేస్తూ నాయుడుపేటలోని అమ్మమ్మ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈనెల 12న ఇంటి నుంచి వెళ్లిన అనిల్ తిరిగి ఇంటి రాకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. అనిల్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఓజిలి పోలీస్ స్టేషన్ కు చేరుకుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.