పెట్రోల్ బంక్ యజమానులకు, సిబ్బందికి, ఫైర్ స్టేషన్ అధికారి ఏం చంద్రమౌళి వారి సిబ్బంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలోని నాలుగో రోజు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా పెట్రోల్ మరియు డీజిల్ ఆయిల్ బంక్ యాజమాన్లకు సిబ్బందికి వేసవికాలనీ దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్త గా వారు పాటించవలసిన జాగ్రత్తలను ఉదయగిరి ఫైర్ స్టేషన్ అధికారి ఎం చంద్రమౌళి సోమవారం కరపత్రాలును గోడకు అంటించే పోస్టర్లను వారికి అందజేసి ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి ముందుగా అవగాహన ఆయా ఎక్స్టింగుషర్ గ్యాస్ సిలిండర్ తో ముందస్తు మంటలను అదుపు చేసుకోనే దిశగా ఆ సిబ్బంది కి ఆయన వారికి ప్రదర్శనాత్మకంగా డెమో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వాహన దారులకు పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారికి వివరించడం జరిగిన అనంతరం కరపత్రం అందించి సూచనలు సలహాలు పాటించినప్పుడు అగ్ని ప్రమాదం సంభవించకుండా అరికట్టవచ్చు అని ఆయన పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం కరపత్రలలోనూ గోడపత్రికల్లో ఉండే 101, 108, నెంబర్లు కు ఫోన్ చేసినట్లయితే మా సిబ్బంది మేము అందుబాటులో ఉంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ నిర్వహణలో, సిబ్బంది, వాహనదారులు, తదితరులు పాల్గొన్నారు.