తిరుమలపురం పంచాయతీలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి

1909చూసినవారు
తిరుమలపురం పంచాయతీలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి
ఉదయగిరి మండలం తిరుమలపురం పంచాయతీలో మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు చింతన బోయిన బయన్న, యూనిట్ పూర్తి ఇంచార్జ్ బాలకృష్ణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు జల్సా యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని బుధవారం ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎన్నికలలో నూరికినూరు శాతం టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ, విస్తృతంగా పర్యటిస్తూ వైయస్సార్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాల వారికి బ్రతుకులు దయనీయంగా మారాయినడానికి కారణం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, పేద మధ్య తరగతి ప్రజలకు భద్రత విషయంలో దృష్టి పెట్టకపోవడమే ప్రధాన కారణాలు అంటూ మన రాష్ట్రానికి ఇదేం కర్మ రా నాయనా అంటూ పలు గ్రామంలోనీ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటూ పత్రిక పర్కటన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలపురం పంచాయతీ మాజీ సర్పంచ్ యు.బాలయ్య, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మా భాష భాస్కర్ ఖాన్ సా, పులి, సందాని, ఆబిద్, మంచాల వెంకయ్య, కంచర్ల వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు టిఎన్ఎఫ్ నాయకులు శివ కృష్ణ, పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్