ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని మర్రిపాడు లోని తన నివాసంలో జలదంకి మండల వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ చేవూరు జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేని కలిసి అయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని పరామర్శించారు. ఇటీవల గుండె కి సంబందించిన వైద్యం కోసం చెన్నై లోని ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స పొంది తిరిగి ఆరోగ్యంగా మర్రిపాడుకు వచ్చిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరియు ప్రచార కార్యదర్శి శాంతమ్మ ని కలిసి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని నియోజకవర్గంలో పర్యటన చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్ బాబు, అన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జలదంకి మండల వైసీపీ రైతు అధ్యక్షులు గండు కృష్ణా రెడ్డి, సోమవరప్పాడు మాజీ సర్పంచ్ మునగాల పాపిరెడ్డి, కోట చంద్రారెడ్డి, కోట కృష్ణా రెడ్డి, కొత్తపాలెం మాజీ సర్పంచ్ జ్యోతి రామచంద్రయ్య పాల్గొన్నారు.