ఆశా డే కార్యక్రమం తనిఖీ చేసిన డివిజన్ ప్రోగ్రాం అధికారిని

81చూసినవారు
ఆశా డే కార్యక్రమం తనిఖీ చేసిన డివిజన్ ప్రోగ్రాం అధికారిని
దుత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జరిగిన ఆశా డే కార్యక్రమాన్ని కావలి డివిజన్ ప్రోగ్రాం అధికారిని బ్రిజిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఆమె మాట్లాడుతూ కాన్పుల సంఖ్యను పెంచాలని, సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రోగులు హాస్పిటల్ కి వచ్చిన సమయంలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్