ఉదయగిరి మండలం సర్కిల్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. రిటైర్డ్ రికార్డ్ అసిస్టెంట్ నల్లబోతుల లక్ష్మీనారాయణ (63) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఉదయగిరి బిట్ త్రీ సచివాలయం వద్ద ఉన్న కిరాణా షాపులో ఐస్క్రీం కొనుక్కొని ఇంటికి వెళ్తున్న 9 ఏళ్ల బాలికను పిలిచి అసభ్య చేష్టలు చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితున్ని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఎస్సై తెలిపారు.