మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గానికి వరప్రసాదిని అయిన గండిపాలెం రిజర్వాయర్ అభివృద్ధి పనులకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృషి చేస్తున్నారు. గండిపాలెం రిజర్వాయర్ కుడి ఎడమ కాలువ పూడికతీత పనులకు 15 లక్షల నిధులు మంజూరు చేసి, ఇరిగేషన్ శాఖ అధికారుల పర్యవేక్షణలో కాలువల అధ్యక్షుల సమక్షంలో పనులను ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. అడవిని తలపించే విధంగా కాలువలలో చెట్లు జంగిలాలతో నిండిపోయింది.