నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని బిట్-1 సచివాలయ పరిధిలో ఎంపీడీవో కార్యాలయంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమం గండిపాలెం పిహెచ్ సి వైద్యాధికారిని శివ కల్పన ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా రోగులకు బీపీ, షుగర్, రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందించే వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని వైద్యురాలు శివ కల్పన కోరారు.