ఉదయగిరికి చెందిన ఉపేంద్ర రెడ్డి అనే యువకుడు జర్మనీలో ఎమ్. ఎస్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్థానిక టిడిపి నాయకులతో ఉపేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. వారిని పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. మృతదేహాన్ని జర్మనీ నుంచి ఉదయగిరి తీసుకురావడానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు.