నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో విద్యుత్ షాక్ తగలడంతో ఓ గేదె మృతి చెందింది. మేతకు వెళ్ళిన గేదె రామాపురం సమీపంలో ట్రాన్స్ ఫారం వద్ద విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గేదె యజమానురాలు దాసరి రావణమ్మ బోరున విలపించారు. గేదె విలువ సుమారు రూ. 80 వేలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం తనను ఆదుకొని సహాయం చేయాలని కోరారు.