వెంకటగిరిలో వైసిపి జెండానే ఎగురవేయాలి: సీఎం జగన్

570చూసినవారు
వెంకటగిరిలో వైసిపి జెండానే ఎగురవేయాలి: సీఎం జగన్
వెంకటగిరి పట్టణంలోని త్రిభువని సమీపంలో ఆదివారం నిర్వహించిన సిద్ధం ఎన్నికల సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ
2019లో వైసీపీకి భారీ మెజార్టీ ఏ విధంగా వచ్చిందో అంతకన్నా ఎక్కువ రావాలని, ఈసారి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగురవేయాలని సీఎం కోరారు. మన పాలన మరోమారు వస్తేనే మన ఇంటి వద్దకు సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా అందుతాయని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్