ఏపీ ప్రభుత్వం 2021 జనవరి 1 నుంచి నూతన వాహన చట్టాన్ని ప్రవేశ పెడుతుంది. అందులో ట్రాఫిక్ రూల్స్ నిబంధనలను అతిక్రమించి.. వాహనాలు నడిపే వారికి భారీ జరిమానాలు విధించేందుకు నడుంబిగించింది. ప్రమాదాలు నివారించేందుకే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడినట్లుగా ఉన్నత అధికారులు తెలుపుతున్నారు. మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రమాదాలు నివారించే అవకాశాలు ఉన్నాయా అన్నదే ఇక్కడ ప్రశ్నగా మారింది.
మామూలు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా లేదా సెల్ ఫోన్ మాట్లాడుతూ.. వేగంగా ద్విచక్ర వాహనాన్ని నడిపి ఇటీవల ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పించిన ద్విచక్ర వాహనదారులు నిర్లక్ష్యం వహిస్తూ.. తమ ప్రాణాలను ప్రమాదంలో పడటమే కాకుండా కుటుంబానికి తీరని శోకం మిగులుస్తున్నారు.
మారిన నూతన వాహన చట్టం ప్రకారం హెల్మెట్ ధరించకపోతే.. గతంలో 135 రూపాయలు ఉండేది ప్రస్తుతం అది 1035 రూపాయలుగా నిర్ణయించారు. అంతేకాదు సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని నడిపితే గతంలో 535 రూపాయలు ఉండే జరిమానాను.. జనవరి 1 నుండి 5 వేల 35 రూపాయల వరకు పెంచేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఐదువేల రూపాయలు జరిమానా.. వాహనాన్ని వేగంగా నడిపితే పది వేల రూపాయల జరిమానా విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
మరి ఇంత భారీగా జరిమానాలు పెంచిన వాహనదారులలో మార్పు కనిపిస్తుందా..? లేదా అన్నది ఇక ప్రశ్నగా మిగిలింది. అంతేకాదు వీరిలో మార్పు రావాలి అంటే అవగాహనతో పాటు కఠినమైన శిక్షలు ఉంటే కానీ మార్పు రాదు అని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే పదివేల రూపాయలు జరిమానా.. తల్లిదండ్రులు తమ మైనర్ బాలలకు వాహనాలు ఇస్తేఐదు వేల రూపాయలు జరిమానా విధించడంతో పాటు.. రేసింగ్ పాల్పడితే 5000 రూపాయలు జరిమానా విధిస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మరి ప్రభుత్వం ఇంత కఠిన చర్యలు తీసుకోవడం వల్ల.. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో..? లేక ప్రజల ప్రాణాలు కాపాడేందుకు భారీ జరిమానాలు పెంచింది అని ప్రజలు భావించి ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలు నివారిస్తారో.. కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. వాహనదారులు పెరిగిన జరిమానాలను చూసి ట్రాఫిక్ రూల్స్ పాటించండమే కాకుండా మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి మీరు భారం కాకుండా వారిని కష్టాలపాలు చేయకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలు నివారించేందుకే.. ఈ లోకల్ యాప్ ప్రత్యేక కథనం.
జనవరి ఒకటి నుంచి మారిన వాహన చట్టప్రకారం ప్రభుత్వం పెంచిన భారీ జరిమానా లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అంతేకాదు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా..? లేదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.