ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే
వీరులపాడు మండలం పరిధిలోని అల్లూరు, పెద్దాపురం, జుజ్జురు, వెల్లంకి వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటించారు. అనంతరం ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. దశాబ్దాల కాలంలో ఇటువంటి విపత్తును ఎన్నడూ చూడలేదన్నారు. సీఎం చంద్రబాబు కార్యదక్షత వల్లే నేడు ముంపు బాధితులు ఈ విపత్తు నుంచి గట్టెక్కారని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.